ఆనంద‌య్య ఆయుర్వేద మందుపై ఆర్జీవి షాకింగ్ కామెంట్స్‌!

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య అనే వ్యక్తి కరోనా నివారణ ఔషధం అంటూ ఇస్తున్న‌ ఆయుర్వేద మందు ఇప్పుడు ఆ జిల్లాలోనే కాదు, ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఈ ఆయుర్వేద ముందు పంపిణీకి ప్రభుత్వం కూడా సుముఖం వ్యక్తం చేసింది. దాంతో క‌రోనా రోగులు ఆనందయ్య ఇస్తున్న మందు కోసం ఎగ‌బ‌డుతున్నారు.

ఇక ప్ర‌తి విష‌యంలో త‌న‌దైన శైలిలో స్పందించే వివాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఆనంద‌య్య ఆయుర్వేద మందుపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయుర్వేద మందు ముక్కులో, నోటిలో, చివ‌రికీ చెవిలో వేయ‌డానికి నేను ఒప్పుకుంటాను.. కానీ కళ్ల‌కు, ఊపిరితిత్తుల‌కు మ‌ధ్య ఉన్న సంబంధం ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటూ ట్వీట్ చేసిన వ‌ర్మ అక్క‌డితో ఆగ‌లేదు.

ప్ర‌భుత్వాలు ఇక‌పై భార‌త్ బ‌యోటెక్, పూనావాలా, స్పుత్నిక్ వంటి వ్యాక్సిన్ కంపెనీల‌కు నిధులు ఇవ్వ‌డం మానేసి ఆనంద‌య్య‌కు ఇవ్వాలి అంటూ ఫ‌న్నీగా ట్వీట్ చేసిన‌ వ‌ర్మ‌.. మ‌రో ట్వీట్‌లో ఒక‌వేళ ఐసీఎమ్ఆర్ ఆనంద‌య్య చికిత్స‌కు ఓకే చెబితే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నెల్లూరులో వాలిపోతుందా.? జ‌స్ట్ అడుగుతున్నాను అంటూ చ‌మ‌త్క‌రించారు. మొత్తానికి ఆర్జీవి ట్వీట్లు కాస్త ఫ‌న్నీగా ఉన్నా.. ఆలోజింప‌చేసేలా ఉన్నాయి.

Share post:

Popular