ప్ర‌దీప్ సినిమాలో స‌మంత‌..బ‌య‌ట‌ప‌డ్డ సీక్రెట్!

బుల్లితెర స్టార్ యాంక‌ర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం 30 రోజుల్లో ప్రేమించటం ఎలా?. ఈ చిత్రంలో అమృత‌ అయ్యర్ హీరోయిన్‌గా న‌టించింది. మున్నా ధూళిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ చిత్రాన్ని ఎస్వీ ప్రొడక్షన్ బ్యాన‌ర్‌పై ఎస్వీ బాబు నిర్మించారు.

అయితే ఈ చిత్రంలో మొద‌ట స‌మంత‌ను హీరోయిన్‌కు అనుకున్నాడ‌ట మున్నా. ఈ క్ర‌మంలోనే స‌మంతకు క‌థ చెప్ప‌గా.. ఆమెకు బాగా న‌చ్చింది కూడాన‌ట‌. ఈ విష‌యాన్ని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న మున్నానే బ‌య‌ట‌పెట్టాడు. కథ రాసుకున్నాక హీరోహీరోయిన్ల వేట ప్రారంభించిన డైరెక్టర్ మున్నా.. ముందుగా స్టార్ హీరోయిన్ సమంతకు ఈ కథ చెప్పాడ‌ట‌.

ఆమెకు స్టోరీ న‌చ్చిన‌ప్ప‌టికీ.. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో సున్నితంగా తిర‌స్క‌రించింద‌ట‌. ఇక స‌మంత నో చెప్పాక‌.. హీరోగా ప్రదీప్‌ను సెలెక్ట్ చేసి.. ఆయ‌న‌కు జోడీగా అమృత అయ్యర్‌ని ఫైనల్ చేశానని.. ఇక ఆమెలోనే సమంతను చూసుకుంటూ సినిమా రూపొందించామని మున్నా చెప్పడం విశేషం.

Share post:

Popular