ఏపీ ప్ర‌జ‌ల‌ను అల‌ర్ట్‌.. రేప‌టి నుంచే కర్ఫ్యూ అమ‌లు!

త‌గ్గింద‌నుకున్న క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ శ‌ర‌వేగంగా విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. అన్ని రాష్ట్రాల్లోనూ క‌రోనా వీర విహారం చేస్తోంది. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ప్ర‌జ‌లు అత‌లాకుత‌లం అయిపోతున్నారు. పెరుగుతున్న క‌రోనా కేసుల దృష్ట్యా ఏపీలో క‌రోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు.

ఇందులో భాగంగానే మే 5నుంచి 19వ తేదీ వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 12గంటల నుంచి తర్వాతి రోజు ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఇందుకు మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది.

దీంతో రేపు మధ్యాహ్నం 12గంటల తర్వాత రాష్ట్రం పరిధిలో అత్యవసర సేవలు మినగా.. అన్ని రకాల వ్యాపారాలు, రవాణా, ఇతర రంగాలు మూతపడనున్నాయి. ఇక ఇత‌ర రాష్ట్రాల నుంచి ఏపీకి రావాలి అనుకునేవారు క‌ర్ఫ్యూ అమ‌లులోకి రాక‌ముందు అంటే 6గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల లోపే రావాల్సి ఉంటుంది.