మ‌ద‌ర్స్‌డే సంద‌ర్భంగా స్పెష‌ల్ ఫొటో షేర్ చేసిన‌ చిరు!

ఈ రోజు మ‌ద‌ర్స్ డే అన్న సంగ‌తి తెలిసిందే. నవమాసాలు మోసి, కని, పెంచి పెద్దచేసి తన ఆశలను తన బిడ్డలో చూసుకుని మురిసిపోయే అమ్మ దైవం కంటే ఎక్కువ‌. అందుకే అమ్మ త్యాగాల‌కు గుర్తుగా మ‌ద‌ర్స్ డే జ‌రుపుకుంటారు. ఈ రోజు ప్ర‌పంచంలోని త‌ల్లులంద‌రికీ త‌మ పిల్ల‌ల నుంచి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఈ క్ర‌మంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న త‌ల్లి అంజ‌నాదేవికి మంద‌ర్స్‌డే విషెస్ తెలుపుతూ ఓ స్పెష‌ల్ ఫొటో షేర్ చేశారు. ఈ ఫొటోలో అంజ‌నాదేవితో పాటు చిరు దంప‌తులు, నాగ‌బాబు దంప‌తులు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రియు చిరు చెల్లెళ్లు క‌నిపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫొటో వైర‌ల్‌గా మారింది.

మ‌రోవైపు మ‌హేష్.. మా అమ్మతో పాటు ఈ ప్ర‌పంచంలో ఉన్న అమ్మ‌లంద‌రికీ మ‌ద‌ర్స్ డే శుభాకాక్ష‌లు అంటూ త‌ల్లి ఇందిరా దేవితో ఉన్న ఫొటోను స‌తీమ‌ణి న‌మ్ర‌త త‌న పిల్ల‌లు గౌత‌మ్, సితార‌ల‌తో ఉన్న ఫొటోను షేర్ చేశాడు.

https://www.instagram.com/p/COox_Gqn6U8/?utm_source=ig_web_copy_link

Share post:

Latest