చిక్కుల్లో మోహనల్ లాల్ సినిమా..?

మోహ‌న్ లాల్, మీనా ప్ర‌ధాన పాత్ర‌లో జీతూ జోసెఫ్ తెర‌కెక్కించిన సినిమా దృశ్యం 2. క‌రోనా కార‌ణంగా మూవీ థియేటర్స్ మూతపడి ఉండటం వల్ల ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యి ఘన విజ‌యం పొందింది. ఈ చిత్రాన్ని హిందీలో కూడా రీమేక్ చేసేందుకు అంతా సిద్ధం చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన పనోరమ స్టూడియోస్‌ ఈ మూవీ హిందీ రీమేక్‌ హక్కులు సొంతం చేసుకుంది. అయితే ఈ అంశం మీద ప్రస్తుతం వివాదం చెల రేగుతుంది.

దానికి కారణం ఈ చిత్రం మొదటి భాగాన్ని హిందీలో వయా కాం 18 మోషన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించడమే. అసలు నిజానికి ఈ చిత్రం మొదటి భాగాన్ని తెరకెక్కించిన దర్శకుడు మాకేర్ కుమార్ మంగట్ ఈ చిత్రం రెండో భాగాన్ని తన సొంత ప్రొడక్షన్ హౌస్ అయిన పనోరమ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మించాలని ప్లాన్ చేశారు కానీ దీనికి వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంస్థ అభ్యంతరం తెలుపుతోంది. దీని కోసం వారు నోటీసులు కూడా పంపారు. చూడాలి మరి ఈ వివాదం చివరికి ఎలా సర్దుకుంటుందో.

Share post:

Latest