విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను దాంతో పోల్చిన ఛార్మీ..గుర్రుగా ఫ్యాన్స్‌?

విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఈ పేరు తెలియ‌ని వారుండ‌రు. పెళ్లిచూపులు సినిమాతో పరిచయమైన ఈ యంగ్ హీరో.. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయారు. ఆ సినిమా త‌ర్వాత విజ‌య్‌కు అభిమానులు భారీగా పెరిగిపోయారు. సామాన్యులే కాదు సెల‌బ్రెటీలు సైతం ఈయ‌నంటే ఇష్ట‌మ‌ని ఓపెన్‌గా చెబుతుంటారు.

- Advertisement -

ఇక తాజాగా ఒక‌ప్ప‌టి హీరోయిన్‌, ప్ర‌స్తుత నిర్మాత ఛార్మీ కౌర్ విజ‌య్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. నిన్న విజయ్ దేవరకొండ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. ఆయ‌న‌తో దిగిన ఫొటోని షేర్ చేసిన ఛార్మి.. నీ గురించి చెప్పడానికి ఒక లైన్ చాలు.. నువ్వు బంగారం 26 క్యారెట్ గోల్డ్ అని కామెంట్ పెట్టింది.

ఛార్మీ విజ‌య్‌ను బంగారంతో పోల్చ‌డంతో ఆయ‌న‌ ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు. కానీ, యాంటీ ఫ్యాన్స్ మాత్రం అంత సీన్ లేదు, కాస్త ఓవ‌ర్ అయింది అంటూ నెగ‌టివ్ కామెంట్స్ పెట్టి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇదిగా ఉంటే.. ప్ర‌స్తుతం విజ‌య్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో లైగ‌ర్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఛార్మీనే నిర్మిస్తోంది.

Share post:

Popular