ఈ నెల‌లో 12 రోజులు బ్యాంకులు మూత‌..వివ‌రాలివే!

సాధార‌ణంగా కొంద‌రికీ నిత్యం బ్యాంకుల్లో ప‌ని ఉంటుంది. అలాంటి వారు త‌ప్ప‌కుండా బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెల‌వులు ఉన్నాయో తెలుసుకోవాలి ఉంటుంది. అయితే ఈ మే నెల‌లో 31 రోజులు ఉంటే. అందులో 12 రోజులు బ్యాంకులు మూత ప‌డ‌నున్నాయి.

అంటే ప్ర‌భుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఈ నెలలో 12 రోజులపాటు సెల‌వులు ఉన్నాయి. అందులో ఐదు ఆదివారాలు, రెండో, నాలుగో శనివారం సాధారణ సెలవులు కాగా, నేడు కార్మిక దినోత్సవం సందర్భంగా సెలవు. అలాగే ఈ నెల 7న జమాతుల్ విదా సందర్భంగా సెలవు ప్రకటించగా, 13న రంజాన్ సెలవు.

14న భగవాన్ శ్రీ పరశురాం జయంతి, బసవ జయంతి, అక్షర తృతీయ సందర్భంగా బ్యాంకులు ప‌ని చేయ‌వు. ఇక 26న బుద్ధపూర్ణిమ కార‌ణంగా బ్యాంకులు ఉండ‌వు. అయితే బ్యాంక్ క్లోజ్‌లో ఉన్నా కూడా ఆన్‌లైన్ బ్యాంకింగ్ సర్వీసులు పొందొచ్చు.

Share post:

Latest