తండ్రి జయంతి నాడు బాలయ్య సర్ప్రైజ్..!

తెలుగు జాతి గర్వపడేలా చేసిన వ్యక్తులలో నందమూరి తారకరామారావు ముందు ఉంటారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. వ్యక్తిగతంగాను, సినిమాల పరంగాను, రాజకీయపరంగా.. ప్రతిచోటా నందమూరి తారక రామారావు తన ప్రావీణ్యాన్ని చూపించి తెలుగు ప్రజల ప్రతిభావాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తుల్లో ఆయన ప్రముఖుడు. ఇకపోతే మే 28న ఆయన జయంతి అన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ రోజున పురస్కరించుకొని తాజాగా నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి బాలకృష్ణ తన తండ్రి అభిమానులకు, అలాగే ఆయన అభిమానులకు సప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు.

ఇదివరకే మే 27న ఉదయం 8 గంటల 45 నిమిషాలకు చిన్న ఉంటుందని ఆయన తెలిపారు. అయితే ఈ సప్రైజ్ లో భాగంగా నందమూరి బాలకృష్ణ తన తండ్రి నటించిన సినిమాల్లోని పాటలను ఆయన స్వయంగా పాడి అభిమానులకు అలరించబోతున్నట్లూ అర్థమవుతోంది. అయితే ఇందుకు సంబంధించి ఇంకా పూర్తి క్లారిటీ లేదు. చూడాలి మరి నందమూరి బాలకృష్ణ ఎటువంటి సర్ప్రైస్ వారి అభిమానులకు ఇవ్వనున్నాడో.

Share post:

Latest