బ్లాక్ ఫంగస్‌ చికిత్స విషయంలో సీఎం కీలక నిర్ణయం..?

గత రెండు వారాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగిస్తున్న కర్ఫ్యూను తాజాగా ఎటువంటి మార్పులు లేకుండా మే నెలాఖరు వరకు జగన్ సర్కార్ పొడిగిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్న సంగతి విధితమే. ఇందులో భాగంగానే జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో మరో కీలక నిర్ణయం తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి లో భాగంగా వచ్చే బ్లాక్ ఫంగస్ చికిత్స కూడా తాజాగా ఆరోగ్యశ్రీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. నేడు జరిగిన ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడ ఆక్సిజన్ కొరత లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు.

రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్పించే విధంగా ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన తెలియజేశారు. వీటితో పాటు ఎవరైనా రాష్ట్రంలో కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు చనిపోయి ఉంటే వారి పిల్లలను ఆదుకునేందుకు ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవాలని సీఎం తెలియజేశారు. ఇందుకు సంబంధించి ఆర్థిక సహాయంపై కొన్ని కార్యాచరణలు రూపొందించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఇందుకు సంబంధించి కొంత మొత్తాన్ని పిల్లల పేరుపై డిపాజిట్ చేసి దానిపై వచ్చే వాడిని ప్రతి నెల వారికి అందజేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.