మిస్ యూనివ‌ర్స్ విజేతగా ఆండ్రియా ..?

ఫ్లోరిడాలో జరిగిన అందాల పోటీ ఫైనల్లో మెక్సికో భామ ఆండ్రియా మెజా మిస్‌ యూనివర్స్‌గా ఎంపికయ్యారు. మెక్సికో దేశానికి చెందిన మెజా.. త‌న అందాలతో ఆక‌ట్టుకోవ‌డ‌మే కాదు.. జ‌డ్జిలు వేసిన ప్ర‌శ్న‌ల‌కు చురుకైన స‌మాధానాలు కూడా ఇచ్చింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న హార్డ్ రాక్ హోట‌ల్‌లో క‌ల‌ర్‌ఫుల్‌గా ఈ వేడుక జ‌రిగింది.

ఇక క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో మిస్ యూనివ‌ర్స్ పోటీల‌ను ఏడాది పాటు వాయిదా వేశారు. మే 16వ తేదీన జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మాన్ని మాజీ మిస్ యూనివ‌ర్స్ విజేత ఒలివియా కుల్పో నిర్వ‌హించారు. స్టేట్‌మెంట్ రౌండ్‌లో మెక్సికో బ్యూటీ ఆండ్రియా త‌న ఆన్స‌ర్ల‌తో అంద‌ర్నీ మెప్పించింది. మారుతున్న బ్యూటీ ప్ర‌మాణాల‌పై ప్ర‌శ్న వేయ‌గా.. రోజు రోజుకూ మ‌న స‌మాజం అడ్వాన్స్ అవుతున్న‌ద‌ని, అలాగే మూస ధోరుణుల్లో ప్ర‌వ‌ర్తించేవాళ్లూ ఉన్నార‌ని, అందం అనేది మ‌న ఆలోచ‌న‌ల్లో, మ‌న గుండెల్లో ఉంటుంద‌ని, అది మ‌న ప్ర‌వ‌ర్త‌న‌ను నియ‌మిస్తుంద‌ని, మ‌న‌ విలువ‌ను చాటేందుకు అందం ఒక కొల‌మానంగా నిలుస్తుంద‌ని ఆండ్రియా వెల్లడించారు.

Share post:

Latest