పిచ్చెక్కిస్తున్న అల్లు శిరీష్ మూవీ ప్రీలుక్ ..!

అల్లుఅర్జున్ అంటే టాలీవుడ్ లో చెప్పలేని క్రేజ్ ఉంది. ఇక ఆయన తమ్ముడు కూడా అన్న బాటలోనే రావడానికి ప్రయత్నించినా సరైన ఫలితం రాలేదు. బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ కు ఇప్పటి వరకూ సరైన సక్సెస్ ను ఏ సినిమా ఇవ్వలేదు. ఇప్పటికే ఈయన టాలీవుడ్ లో గౌరవం, కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ వంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన 6వ సినిమాను ప్రకటించారు. ఆ సినిమాకు ప్రస్తుతం “శిరీష్-6” అని టైటిల్ ఫిక్స్ చేశారు.

ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ ని మూవీ యూనిట్ విడుదల చేసింది. పోస్టర్ లో శిరీష్ ఒక యువతిని ముద్దు పెట్టుకున్నట్టు కనిపించింది. ఈ పోస్టర్ లో మొహాలు కనిపించని ఇద్దరు గాఢమైన రొమాన్స్ చేస్తున్నట్టు కనిపించింది. ఐతే ఈ సినిమాలో హీరోయిన్ గా మజ్ను ఫేమ్ అనూ ఇమ్మాన్యుయేల్‌ నటిస్తున్నారు. దీంతో ఈ పోస్టర్ లో అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్‌ లిప్‌‌కిస్ చేసుకుంటూ రెచ్చిపోతున్నట్టు తెలుస్తోంది. ప్రీ లుక్ చాలా రొమాంటిక్ గా ఉండటంతో అల్లు అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. అల్లు శిరీష్ బర్త్ డే అయిన మే 30వ తేదీన పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఆ రోజే సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కానుంది.

Share post:

Latest