బన్నీ ఎమోషనల్ ట్వీట్ వైరల్..!

టాలీవుడ్ స్టైలిష్ హీరో అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఆర్య మూవీ 2004, మే 7న రిలీజ్ అయ్యి నేటితో 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బన్నీ తన సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ ట్వీట్ చేసాడు. ఆర్య చిత్రం రిలీజ్ అయ్యి నేటికి 17 ఏళ్లు అవుతుంది. ఇది నా లైఫ్ చేంజింగ్ మూవీస్ లో ఇది కూడా ఒకటి. ఈ మూవీ నా జీవితంలో జరిగిన గొప్ప అద్భుతం.

ఫీల్ మై లవ్ అంటూ నేను పలికిన థెయ్యతి మాటలు తర్వాత ప్రేక్షకులు నా పై వారి ప్రేమను కురిపించడం మొదలు పెట్టారు అంటూ బన్నీ తన ట్వీటర్ లో పేర్కొన్నారు. ఆర్య మూవీ మా అందరి జీవితాలను ఒక్కసారిగా మార్చేసింది. అటు నటుడిగా నాకు, దర్శకుడిగా సుకుమార్‌కు, నిర్మాతగా దిల్ రాజుకు, సంగీత దర్శకుడిగా దేవిశ్రీ కి, డీఓపీగా రత్నవేలుకు , డిస్ట్రిబ్యూటర్‌గా బన్నీ వాసు ఇలా అందరి జీవితాలు ఈ మూవీతో మారిపోయాయిఅని అల్లు అర్జున్ అన్నారు.

Share post:

Popular