అఖిల్ కోసం చిరు డైరెక్ట‌ర్‌ను లైన్‌లో పెట్టిన‌ నాగ్‌?

నాగార్జున త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన‌ అఖిల్ అక్కినేని.. ఇప్ప‌టి వ‌ర‌కు హీరోగా మూడు సినిమాలు చేశాడు. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. ప్ర‌స్తుతం బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తునన్నాడు అఖిల్‌.

- Advertisement -

ఈ చిత్రం ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉన్నా.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఇక ఈ చిత్రం విడుద‌ల‌కు ముందే..ఏజెంట్ అనే సినిమా మొదలు పెట్టాడు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ చిత్రం త‌ర్వాత అఖిల్ కొర‌టాల శివ‌తో చేయ‌బోతున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

అఖిల్ కోసం నాగార్జున‌నే స్వ‌యంగా కొర‌టాల‌ను క‌థ సిద్ధం చేయ‌మ‌ని చెప్పార‌ట‌. దాంతో కొర‌టాల క‌థ రెడీ చేసే ప‌నిలో ఉన్న‌ట్టు టాక్‌. కాగా, కొర‌టాల శివ ప్ర‌స్తుతం చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది.

Share post:

Popular