మ‌రోసారి ఇలియానాను ఆదుకునేందుకు ఫిక్సైన స్టార్ హీరో?

ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఇలియానా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కెరీర్ పీక్స్‌లో ఉన్న స‌మ‌యంలో ఈ బ్యూటీ టాలీవుడ్ నుంచి బ్రేక్ తీసుకుని బాలీవుడ్ బాట ప‌ట్టింది. అక్కడ ఒకటి రెండు హిట్లు అందుకున్న ఇలియానాకు ఆ తర్వాత ఆఫర్లు కరువయ్యాయి.

దాంతో ఇలియానా కెరియర్ డైలమాలో పడింది. అలాంటి స‌మ‌యంలో బాద్‌షాహో సినిమాలో ఛాన్స్‌ ఇచ్చి ఇలియానాను ఆదుకున్నారు స్టార్ హీరో అజయ్‌ దేవగన్‌. ఆ త‌ర్వాత‌ మరోసారి రైడ్ సినిమాలోనూ ఇలియాన‌కు హీరోయిన్‌ ఛాన్స్ ఇచ్చారు. ఇక ఇప్పుడు కూడా గోవా బ్యూటీ గ్రాఫ్ దారుణంగా ప‌డిపోయిన సంగ‌తి తెలిసిందే.

దీంతో ఈమె డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధ‌మైంది. అయితే ఇలియానా డిజిటల్‌ ఎంట్రీకి కూడా అజయ్‌ దేవగనే రెడ్‌ కార్పెట్ వేయ‌బోతున్నార‌ట‌. అజ‌య్ దేవ‌గ‌న్ త్వ‌ర‌లోనే రుద్ర అనే థ్రిల్లర్‌తో డిజిటల్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఇందులో ఇలియానాకు ఛాన్స్ ఇచ్చార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

Share post:

Latest