ఐపీఎల్‌లో ర‌ష్మిక ఫెవరెట్‌ టీమ్ అదేన‌ట‌..!

ర‌ష్మిక మంద‌న్నా.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచాయ‌లు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్ర‌స్తుతం తెలుగుతో పాటు క‌న్న‌డ‌, త‌మిళ్ మ‌రియు హిందీ భాష‌ల్లో ఫుల్ బిజీ బిజీగా గ‌డుపుతోంది.

మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ర‌ష్మిక‌.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా అభిమానుల‌తో ముచ్చ‌టించింది. ఈ సందర్భంగా ఒక అభిమాని ఆమెను ఐపీఎల్‌లో మీ ఫెవరెట్‌ టీమ్‌ ఏది అని ప్ర‌శ్నించాడు. అందుక‌ రష్మిక.. ఈ సాలా కప్‌ నమ్‌దే అంటూ ఇన్‌డైరెక్ట్‌గా ఆర్‌సీబీ తన ఫెవరెట్‌ అని చెప్పింది.

ఈ సాలా కప్‌ నమ్‌దే అనేది ఆర్‌సీబీ స్లోగన్‌.. యూఏఈ వేదికగా గతేడాది జరిగిన ఐపీఎల్‌​ సీజన్‌కు ఈ స్లోగన్‌తో బరిలోకి దిగింది. కాగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్‌లో టైటిల్ గెలిచింది లేదు. కానీ, ఈ టీమ్‌కు మాత్రం అభిమాన గణం చాలా ఎక్కువ‌. సామాన్యులే కాదు సెల‌బ్రెటీలు కూడా ఆర్సీబీ టీమ్‌ను ఎంత‌గానో అభిమానిస్తుంటారు.

Share post:

Latest