భ‌ర్త‌తో వ్యాక్సిన్ తీసుకున్న కాజ‌ల్..ఫొటోలు వైర‌ల్‌!

ఫ‌స్ట్ వేవ్‌తో పోలిస్తే సెకెండ్ వేవ్‌లో క‌రోనా దేశ వ్యాప్తంగా విల‌య‌తాండ‌వం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సామాన్యుడు, సెల‌బ్రెటీ అనే తేడా లేకుండా అంద‌రిపై క‌రోనా పంజా విసురుతోంది. మ‌రోవైపు క‌రోనాను నిర్మూలించేందుకు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జోరుగా కొన‌సాగుతోంది.

ఈ క్ర‌మంలోనే సెల‌బ్రిటీలు ఒక్కొక్క‌రిగా వాక్సిన్ వేయించుకుని..టీకాపై ప్ర‌జ‌ల్లో ఉన్న అపోహ‌ల‌ను దూరం చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తాజాగా కాజ‌ల్ అగ‌ర్వాల్ భ‌ర్త గౌత‌మ్ కిచ్లూతో క‌లిసి ఫ‌స్ట్ డోస్ క‌రోనా వాక్సిన్ తీసుకుంది.

ముంబైలోని నానావతి ఆస్పత్రిలో ఆమె భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి వ్యాక్సిన్ పొందింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఫ‌స్ట్ షాట్ అయిపోయింది అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైర‌ల్‌గా మారాయి.

Kajal Aggarwal Got Vaccinated

Share post:

Popular