డి – కంపెనీ: 4 నిమిషాల వీడియోతో అంచ‌నాలు పెంచేసిన వ‌ర్మ‌!

May 8, 2021 at 10:00 am

ఒక‌ప్ప‌టి టాలీవుడ్‌ స్టార్ డైరెక్ట‌ర్‌, వివాదాల‌కు కేరాఫ్ అడ్రెస్ రామ్ గోపాల్ వ‌ర్మ ప్ర‌స్తుతం తీస్తున్న చిత్రాల్లో డి-కంపెనీ ఒక‌టి. మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్ దావూద్‌ ఇబ్రహీం జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని వ‌ర్మ తెర‌కెక్కించాడు.

ముంబయిలోని ఓ చిన్న గ్యాంగ్‌ లీడర్‌.. పెద్ద గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎదిగాడో ఈ చిత్రంలో చూపించ‌నున్నారు. అష్వత్‌ కాంత్, ఇర్రా మోహన్, రుద్రకాంత్‌, నైనా గంగూలి ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన ఈ చిత్రం మే 15న స్పార్క్‌ ఓటీటీ సంస్థ‌లో విడుద‌ల కాబోతోంది. ఈ సంద‌ర్భంగా సినిమాలోని 4 నిమిషాల స‌న్నివేశాన్ని వ‌ర్మ సోష‌ల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.

ఈ నాలుగు నిమిషాల వీడియో ఆధ్యంతం ఆస‌క్తిక‌రంగా సాగింది. ముంబ‌యి చాలా ప్ర‌శాంతంగా ఉంది. కానీ అప్పుడు 40 సంవ‌త్స‌రాల క్రితం డీ కంపెనీ కంట్రోల్ ఉన్న‌ప్పుడు ఇలా ఉండేది కాదు అంటూ వ‌ర్మ చెప్పే మాట‌లు సినిమాపై అంచ‌నాలు పెంచేసింది. మ‌రి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేసేయండి.

డి – కంపెనీ: 4 నిమిషాల వీడియోతో అంచ‌నాలు పెంచేసిన వ‌ర్మ‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts