బుల్లితెర ‌పై కూడా దుమ్ము రేపుతున్న జాంబీ రెడ్డి..!

తేజ సజ్జ హీరోగా యువ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కెక్కించిన సినిమా జాంబీ రెడ్డి. క‌రోనా నేప‌థ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కు ఫుల్ హాస్యాన్ని అందించడంలో విజయం పొందింది. చిన్న సినిమాగా వ‌చ్చిన ఈ చిత్రం 15 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టి రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో తెలుగు అమ్మాయి అయిన నందినీ ఇంకా ఢిల్లీ భామ దక్షనగర్కర్ హీరోయిన్స్‌గా చేసారు. ఇంకా ఈ సినిమాలో గెటప్ శీను, హేమంత్, అన్నపూర్ణ ముఖ్య పాత్రలు పోషించారు.

జాంబీ జోన‌ర్‌లో వ‌చ్చిన మొదటి తెలుగు చిత్రం జాంబీ రెడ్డి కాగా, ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్ర‌ముఖ టీవీ ఛానెల్‌లో ప్ర‌సారం అయింది. దీనికి ఏకంగా 9.7 టీర్పీ వ‌చ్చింది. ఈ రేంజ్ టీ ఆర్పీ రావ‌డాన్ని రావటం ఇదే మొదటి సారి కాగా ఇది చూసి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఆశ్చ‌ర్య‌పోతున్నాయి. జాంబీ రెడ్డి చిత్ర ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ మొదటి సినిమాగా అ. ఈ చిత్రంతో ప్ర‌శాంత్ వ‌ర్మ జాతీయ అవార్డ్ కూడా పొందాడు.

Share post:

Popular