వైస్సార్సీపీ పార్టీఫై విరుచుక పడ్డ నారా లోకేష్..!?

తాజాగా తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పై జరిగిన రాళ్ల దాడి పై చంద్రబాబు తనయుడు నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు పై రాళ్లు విసరడం ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి యాక్షన్ కుక్కల పని అంటూ తీవ్ర పదజాలంతో ఆయన వైఎస్సార్ సిపి శ్రేణుల పై విరుచుకు పడ్డాడు. ఇదివరకు తిరుపతి కొండ పైన తీవ్రవాదులు, స్మగ్లర్లు కలిసి 24 మైన్స్ పెట్టి పీల్చితే వాడిని దాటుకొని చంద్రబాబు ప్రాణాలను సాక్షాత్తు ఏడుకొండల వాడు కాపాడాలంటూ గుర్తుచేశాడు.

ఆ దాడి నుంచి ఏ ఒక్కరు బతికే అవకాశం లేని సమయంలో చంద్రబాబు తేరుకొని తన సహచరులు ఎలా ఉన్నారని వాకబు చేసిన ఏకైక గుండె ధైర్యం గల వ్యక్తి చంద్రబాబు అని లోకేష్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇందులో భాగంగా నారా లోకేష్ తాజాగా మీలాంటి ఫ్యాక్షన్ కుక్క మూతి పిందెలు వేషాలు ఆయనని భయపెట్టే లేవని జగన్ వర్గీయులు రాళ్లు వేస్తే ఆ రాళ్లతో జనానికి పనికొచ్చే ఒక నిర్మాణం చేయించగల ఆలోచన చంద్రబాబుది అంటూ.. తిరుపతిలో తోకముడిచి తొలి ఓటమి అంగీకరించారు అంటూ టిడిపి సభలకు వస్తున్న జనాన్ని ఓర్చుకోలేక రౌడీ మూకలు దాడి చేసి ఓటమి కూడా ఒప్పుకున్నావు వైయస్ జగన్ అంటూ లోకేష్ జగన్ పై విరుచుకు పడ్డాడు.

ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడు పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర గవర్నర్ తో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా టిడిపి ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అయ్యింది. దీనికోసం ఇప్పటికే టిడిపి నాయకులు గవర్నర్ అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే కాకుండా నేడు సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘానికి టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు అందరూ కలిసి కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు పై జరిగిన రాళ్ల దాడికి ఉద్దేశించి ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.

Share post:

Latest