వైర‌ల్ వీడియో: మోకాళ్లపై కూర్చొని ర‌ష్మిక‌కు ప్ర‌పోజ్ చేసిన విజ‌య్‌!‌

టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా జోడీకి ఎంద‌రు ఫ్యాన్స్ ఉన్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో జంట‌గా న‌టించిన వీరిద్ద‌రూ.. ఆన్ స్క్రీన్ పై అద్భుత‌మైన కెమిస్ట్రీని పండించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యారు.

ఈ సినిమాల‌ త‌ర్వాత వీరిద్ద‌రూ మంచి ఫ్రెండ్ షిప్ మెయిన్‌టైన్ చేస్తున్నారు. ఎప్పుడూ ఒకరితో ఒకరు టచ్‌లో ఉండటం, వీలున్న‌ప్పుడ‌ల్లా క‌ల‌వ‌డం చేస్తుండ‌డంతో.. వీరి మ‌ధ్య ల‌వ్ ట్రాక్ న‌డుస్తుంద‌ని వార్త‌లు కూడా వ‌చ్చాయి. ముఖ్యంగా మొన్నీ మ‌ధ్య ముంబైలోని ఓ హోట‌ల్‌కి వీరిద్ద‌రూ డిన్న‌ర్‌కు వెళ్ల‌డంతో.. ఆ వార్త‌ల‌కు మ‌రింత బ‌లం చేకూరాయి.

అయితే తాజాగా విజ‌య్ మోకాళ్ల‌పై కూర్చొని ర‌ష్మిక‌కు గిఫ్ట్ ఇస్తూ ప్ర‌పోజ్ చేశాడు.కానీ, ఇది రియ‌ల్ లైప్‌లో కాదండోయ్‌.. రీల్ లైఫ్‌లోనే. విష‌యం ఏంటంటే..సంతూర్‌ సోప్‌ యాడ్‌లో ఈ జంట కలిసి నటించింది. ఇప్పటికే ముంబైలో యాడ్ షూట్ పూర్తి అయింది. త్వరలో టెలికాస్ట్ కాబోయే ఈ కమర్షియల్ యాడ్‌లో విజయ్, రష్మికకు ప్రపోజ్‌ చేశాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది. ఇక ఈ యాడ్‌కు సంబంధించే ముంబై హోట‌ల్‌లో మీట్ అయ్యార‌ని తెలుస్తోంది.