`విరాటపర్వం` నుంచి కొత్త పోస్ట‌ర్‌..ఆక‌ట్టుకుంటున్న సాయిప‌ల్ల‌వి!

ద‌గ్గుబాటి రానా, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `విరాట‌ప‌ర్వం`. వేణు ఉడుగుల దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో

అలాగే నవీన్‌ చంద్ర, ప్రియమణి, నందితా దాస్‌, నివేదా పేతురాజ్‌, ఈశ్వరీరావు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే.. నేడు ఉగాది పండ‌గ సంద‌ర్భంగా ఈ చిత్రం నుంచి స‌రికొత్త పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

ఈ పోస్ట‌ర్‌లో గ‌డ‌ప‌కు ప‌సుపు రాస్తూ ఎంతో అందంగా సాయి ప‌ల్ల‌వి క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ అభిమానుల‌ను తెగ ఆక‌ట్టుకుంటోంది. కాగా, నక్సలైట్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకోగా.. ప్ర‌స్తుతం విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది.

Share post:

Latest