టక్‌ జగదీష్‌ మూవీ విశేషాలు చెప్పుకొచ్చిన నాని..!

తాను ఎడిట్‌ రూమ్‌ నుంచి బయటకు రాగానే దర్శకుడు శివ నిర్వాణతో సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇది ఫిక్స్ అని చెప్పాను అంటూ చెప్పుకొచ్చాడు స్టార్ హీరో నాని. నా కెరీర్‌లోనే ఇది చాలా ప్రత్యేకమైన సినిమా అని అన్నారు నాని. ఆయన హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన మూవీ టక్‌ జగదీష్‌. షైన్ ‌స్క్రీన్‌ పతాకం పై సాహు గారపాటి, హరీష్‌పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 23న రిలీజ్ కానుంది ఈ సినిమా. గురువారం నాడు మూవీ ట్రైలర్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

అత్యంత భావోద్వేగభరితమైన కుటుంబ చిత్రంగా అందరి హృదయాల్ని స్పృశిస్తుంది ఈ చిత్రం అని అన్నారు. ఏప్రిల్‌ మాసానికి మంత్‌ ఆఫ్‌ జగదీష్ అనే హ్యాష్‌టాగ్‌ కూడా పెట్టారు. ప్రతి ఒక్కరి కుటుంబాల్లోని అనుబంధాల్ని ఈ చిత్రంలో చూపించాం. కొన్ని ఏళ్ల పాటు గుర్తుండిపోయే సినిమా అవుతుంది అని దర్శకుడు తెలిపారు. చిత్ర ట్రైలర్‌ను ఈ నెల 13న వైజాగ్‌లో రిలీజ్ చేయనున్నారు. అలాగే 18న హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహిస్తాం అని మూవీ నిర్మాత సాహు గారపాటి తెలిపారు.

Share post:

Latest