క‌రోనా దెబ్బ‌..ఓటీటీలో అన‌సూయ `థ్యాంక్ యు బ్ర‌ద‌ర్‌`!

బుల్లితెర స్టార్ యాంక‌ర్ అన‌సూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’. రమేష్ రాపర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని జ‌స్ట్ ఆర్డిన‌రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై మాగుంట శ‌ర‌త్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న థియేట‌ర్‌లో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. కానీ, క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా విజృంభిస్తోంది. ఇలాంటి త‌రుణంలో ఏ సినిమా థియేట‌ర్‌కు వ‌చ్చే ప‌రిస్థితి లేదు. ఈ క్ర‌మంలోనే థ్యాంక్ యు బ్ర‌ద‌ర్ చిత్రాన్ని థియేట‌ర్‌లో కాకుండా ఓటీటీలో విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు.

ఇందులో భాగంగానే.. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహాలో థ్యాంక్ యూ బ్ర‌ద‌ర్ చిత్రం మే 7న ఆహాలో విడుద‌ల కానుంది. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ తాజాగా ప్ర‌క‌టించారు. కాగా, ఈ సినిమాలో అనసూయ గ‌ర్భ‌వ‌తి పాత్రలో కనిపించ‌బోతోంది. ఇప్ప‌టికే చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల కాగా.. ఇది అభిమానుల‌ను, నెటిజ‌న్స్ ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.

Image

Share post:

Popular