బ్రేకింగ్: క‌రోనా బారిన ప‌డ్డ మంత్రి కేటీఆర్‌!

కంటి క‌నిపించ‌కుండా ముప్ప తిప్ప‌లు పెడుతున్న క‌రోనా సెకెండ్ వేవ్‌లో ఎంత వేగంగా విజృంభిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సామాన్యులు, సెల‌బ్రెటీలు, రాజకీయ నాయ‌కులు, క్రీడా కారులు అనే తేడా లేకుండా ఈ మ‌హ‌మ్మారి అంద‌రిపై పంజా విసురుతోంది.

తాజాగా తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్ కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో తాజాగా కేటీఆర్ క‌రోనా టెస్ట్ చేయించుకోగా.. అందులో ఆయ‌న‌కు పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌నే ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. ప్రస్తుతం కేటీఆర్ హోమ్ ఐసోలేష‌న్‌లో ఉన్నారు.

Share post:

Latest