సుల్తాన్ మూవీ కలెక్షన్స్ అదరగొడుతున్నాయి..!

కోలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్లో కూడా మంచి ప్రేక్షక ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు తమిళ్ హీరో కార్తీ. ఆయన నటించిన లేటెస్ట్ చిత్రం సుల్తాన్‌. ఈ మూవీలో ర‌ష్మిక మంద‌న హీరోయిన్, బ‌క్కియ‌రాజ్ క‌ణ్ణన్ ద‌ర్శకుడు. డ్రీమ్ వారియ‌ర్ పిక్చర్స్ బ్యాన‌ర్ ‌పై య‌స్‌.ఆర్‌. ప్రకాష్ బాబు, య‌స్‌.ఆర్‌.ప్రభు కలిసి ఈ సినిమాని నిర్మించారు. ఏప్రిల్‌2న ఈ చిత్రంవిడుదల అయ్యి, యావరేజ్ టటాక్ సంపాదించుకుంది . కానీ ఫస్ట్ డే నుండే మంచి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది ఈ మూవీ.

సుల్తాన్ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల బిజినెస్ అయింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 6.5కోట్ల షేర్ చెయ్యాలి. మొదటి రోజు ఈ చిత్రం 1.20 కోట్ల షేర్ ను తీసుకురాగా, మరో 5.30 కోట్ల షేర్ ను రాబడితే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయినట్టే అని చెప్పచు. మాస్ సెంటర్స్ లో కూడా ఈ మూవీ పెర్ఫార్మన్స్ చాలా బాగుంది.

Share post:

Popular