ఓటీటీలో రాబోతున్న ర‌ష్మిక కొత్త సినిమా..ఎగ్జైట్‌గా ఫ్యాన్స్‌!

కోలీవుడ్ స్టార్ హీరో కార్తి, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `సుల్తాన్‌`. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మించారు.

త‌మిళంతో పాటు తెలుగులోనూ తెర‌కెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. మిక్డ్స్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుద‌ల అయ్యేందుకు సిద్ధం అవుతోంది.

ప్ర‌ముఖ ఓటీటి ప్లాట్ ఫామ్ డిస్నీ+హాట్ స్టార్‌లో ఈ సినిమా ఏప్రిల్‌ 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తమిళ, తెలుగు వెర్షన్స్ రెండూ ఓటీటిలో రిలీజ్ కానున్నాయి. ఇక ఈ విష‌యంపై స‌ద‌రు ఓటీటీ సంస్థ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. దాని కోస‌మే అటు కార్తి ఫ్యాన్స్‌, ఇటు ర‌ష్మిక ఫ్యాన్స్ ఎగ్జైట్‌గా వెయిట్ చేస్తున్నారు.‌

Share post:

Latest