ఆ దర్శకురాలితో సూపర్ స్టార్ సినిమా..!?

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటే అభిమానులకు పండుగే పండగ. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న సర్కారు వారి పాట చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ కు జతగా బ్యూటీ క్వీన్ కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ చిత్రం 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పుడు తాజాగా మహేష్ సుధ కొంగర దర్శకత్వంలో ఒక మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్త ఇప్పుడు సినీ వర్గంలో నడుస్తుంది. దర్శకురాలిగా తమిళంలో సుధా కొంగరకి మంచి పేరు ఉంది. ఇటీవల తమిళంలో సూర్య హీరోగా ఆమె తెరకెక్కించిన ఆకాశం నీ హద్దురా మూవీ ఘన విజయంతో పాటు ప్రశంసలను తెచ్చిపెట్టింది. ఆమె ఇటీవల మహేశ్ బాబును కలిసి ఒక కొత్త కథ వినిపించారట. కథ నచ్చడంతో వెంటనే మహేష్ ఓకే చెప్పాడని టాక్. కాబ్బటి త్వరలోనే ఆ దర్శకురాలితో సూపర్ స్టార్ మహేష్ సినిమా ఉండనుంది.

Share post:

Latest