అభిమానుల‌కు గుడ్‌న్యూస్ చెప్పిన సోనూసూద్!

క‌రోనా వైర‌స్ సెకెండ్ వేవ్‌లో ఎంత వేగంగా విజృంభిస్తోందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. కంటికి క‌నిపించుకు ప్ర‌జ‌ల‌ను, ప్ర‌భుత్వాల‌ను అల్లాడిస్తున్న క‌రోనా.. ఇప్ప‌టికే ల‌క్ష‌ల మందిని బ‌లితీసుకుంది. సామాన్యులే కాదు.. సెల‌బ్రెటీలు, రాజ‌కీయ నాయ‌కులు, క్రీడి కారులు ఇలా అంద‌రూ క‌రోనా బారిన ప‌డుతున్నారు.

ఇటీవ‌ల న‌టుడు, స‌మాజ సేవ‌కుడు సోనూ సూద్‌కు కూడా క‌రోనా సోకిన సంగ‌తి తెలిసిందే. దాంతో అభిమానులు సోనూ క‌రోనా నుంచి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఎంత‌గానో కోరుకున్నారు. అయితే అభిమానులు కోరుకున్న‌ట్టుగానే జ‌రిగింది.

తాజాగా సోనూ గుడ్‌న్యూస్ చెప్పారు. తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆయనకు నెగెటివ్ వచ్చింది. తనకు నెగెటివ్ వచ్చిందన్న విషయాన్ని సోనూ సూద్ సింబాలిక్ గా చెప్పే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన ఫొటోను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.

https://twitter.com/SonuSood/status/1385548117630623749?s=20