అక్క‌డ‌ 1.6 కోట్లు సంపాదించిన స‌మంత‌..ఖుషీలో ఫ్యాన్స్‌!

అక్కినేని వారి కోడ‌లు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. పెళ్లి త‌ర్వాత కూడా వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న ఈ బ్యూటీ తాజాగా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

- Advertisement -

సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ.. సోష‌ల్ మీడియా ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది స‌మంత‌. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు సంబంధించిన ఫొటోలను, వీడియోల‌ను షేర్ చేస్తూ.. అభిమానుల‌కు చేరువ‌వుతుంటుంది. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 16 మిలియన్‌ ఫాలోవర్స్ అంటే 1.6 కోట్ల ఫాలోవ‌ర్స్‌ను స‌మంత సంపాదించుకుంది.

ఈ విషయాన్ని సమంత తన ఇన్‌స్టా స్టోరీస్‌ ద్వారా తెలియజేస్తూ అభిమానులకు థాంక్స్‌ చెప్పారు. దీంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతూ.. స‌మంత‌కు కంగ్రాట్స్ తెలుపుతున్నారు. కాగా, స‌మంత ప్ర‌స్తుతం గుణశేఖర్‌ దర్శకత్వంలో `శాకుంతలం`లో న‌టిస్తోంది. అలాగే ఈమె న‌టించిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.‌

Share post:

Popular