మాస్టర్ సినిమాను రీమేక్ చేసేందుకు సిద్ధం అవుతున్న సల్మాన్ ..!?

ప్రముఖ బాలీవుడ్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ తమిళ్ హీరో విజయ్ నటించిన మాస్టర్ సినిమా రీమేక్ లో నటించనున్నారు. ఈ సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై నిర్మాతలు పెట్టిన మొత్తానికి రెట్టింపు స్థాయిలో కలెక్షన్లను వసూలు చేసింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కనబరిచిన నటన అందరిని బాగా ఆకట్టుకుంది.

- Advertisement -

అయితే ఈ సినిమా బాలీవుడ్ బడా నిర్మాతలకు కూడా బాగా నచ్చటంతో, ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి రెడీ అయ్యారు. కబీర్ సింగ్ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన మురాద్ ఖేతాని ఎండేమోల్ షైన్ తో కలసి మాస్టర్ హిందీ రీమేక్ ని నిర్మించబోతున్నారని సినీ వర్గాల టాక్. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ని హీరోగా చేయనున్నారు. ఏది ఏమైనా బాలీవుడ్ టైగర్ సల్మాన్ ఖాన్ విజయ్ సినిమాని రీమేక్ చేయడం అంటే గొప్ప విషయమే.

Share post:

Popular