ఆర్ ఆర్ ఆర్ నుంచి సర్ప్రైజ్ అదిరిపోయిందిగా….!?

ఆర్‌ఆర్‌ఆర్ మూవీ టీమ్‌ నుంచి మరో స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ రాణే వచ్చేసింది. అజయ్‌ దేవ్‌గణ్‌ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రంలోని ఆయన పాత్రను తెలియజేసేలా ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను మూవీ బృందం తాజాగా రిలీజ్ చేసింది. రామ్‌చరణ్‌, తారక్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో అజయ్‌ దేవ్‌గణ్‌ ఒక కీలక పాత్ర పోషించారు. శుక్రవారం నాడు అజయ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్ మూవీ టీమ్‌ ఈ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ప్లాన్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్‌ అందరిని బాగా ఆకట్టుకుంటోంది.

దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌గా తారక్‌ నటిస్తున్నారు. ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాత. ఈ మూవీలో ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌ హీరోయిన్ గా చేస్తున్నారు. శ్రియ, సముద్రఖని, హాలీవుడ్‌ తారలు ఎలిసన్‌ డ్యూడీ, రేయ్‌ స్టీవెన్‌సన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. దసరా పండుగను పురస్కరించుకుని అక్టోబర్‌ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Share post:

Popular