టాలీవుడ్ టాప్ హీరో షాకింగ్ రెమ్యున‌రేష‌న్‌..?

`క్రాక్‌` సినిమాతో సూప‌ర్ హిట్ అందుకుని మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చిన‌ టాలీవుడ్ మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం రమేష్‌ వర్మ దర్శకత్వంలో `ఖిలాడీ` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఇంకా విడుద‌ల‌ కాక‌ముందే.. ఉగాది పండ‌గా నాడు మ‌రో సినిమాను ప‌ట్టాలెక్కించాడు ర‌వితేజ‌.

- Advertisement -

శరత్ మండవ దర్శకత్వలో తెర‌కెక్క‌బోతున్న ఈ చిత్రాన్ని ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా న‌టించ‌నుంది. అయితే ఈ చిత్రానికి ర‌వితేజ కేవ‌లం ముప్పై రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చాడట.

అందుకుగాను రవితేజ దాదాపు రూ.8 కోట్ల వరకు రెమ్యున‌రేష‌న్ పుచ్చుకుంటున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాదు, వైజాగ్- నైజామ్ ఏరియా రైట్స్ లో యాబై శాతం వాటా కూడా తీసుకునే విధంగా నిర్మాత‌తో డీల్ కుదుర్చుకున్నార‌ని టాక్ న‌డుస్తోంది. దీని బ‌ట్టీ చూస్తుంటే.. క్రాక్ హిట్‌తో ర‌వితేజ మార్కెట్ బాగానే పెరిగింద‌ని చెప్పాలి.

Share post:

Popular