ర‌ష్మిక జోరు..మ‌రో బాలీవుడ్ సినిమాను ప‌ట్టాలెక్కించిన బ్యూటీ!

ర‌ష్మిక మంద‌న్నా.. ప్ర‌స్తుతం ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛలో` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ర‌ష్మిక‌.. చాలా త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం తెలుగులో అల్లు అర్జున్ స‌ర‌స‌న `పుష్ప‌`, శ‌ర్వానంద్ స‌ర‌స‌న `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రాల్లో న‌టిస్తోంది.

అలాగే సుల్తాన్ సినిమాతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ర‌ష్మిక‌.. `మిషన్‌ మజ్ను` సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్ట‌నుంది. ప్ర‌స్తుతం మిష‌న్ మ‌జ్ను షూటింగ్ శ‌ర‌వేంగా జ‌రుగుతోంది. అయితే ఇంకా ఈ సినిమా పూర్తి కాకుండానే.. బాలీవుడ్‌లో మ‌రో సినిమాను ప‌ట్టాలెక్కించేసింది ర‌ష్మిక‌.

రష్మిక తన రెండో చిత్రాన్ని బిగ్ బీ అమితాబ్‌తో కలిసి నటించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి `గుడ్ బై` అనే టైటిల్ ఖ‌రారు చేశారు. వికాస్ బల్ రూపొందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ గురువారం లాంఛ‌నంగా ప్రారంభమైంది. ఇక మొదటి షెడ్యూల్‌లోనే అమితాబ్, రష్మిక‌త‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరించేలా చిత్రయూనిట్‌ ప్లాన్‌ చేసిందని బాలీవుడ్‌ సమాచారం.

Share post:

Latest