ప్రేక్షకులకు వార్నింగ్ ఇచ్చిన సౌత్ బ్యూటీ..!!

తమిళ స్టార్ హీరో కార్తీ ఏప్రిల్ 2న సుల్తాన్ మూవీతో ప్రేక్షకులని పలకరించనున్నాడు. రెమో మూవీతో తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులనీ మెప్పించిన యువ దర్శకుడు బక్కియరాజ్‌ కణ్ణన్‌ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. లక్కీ భామ రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. డ్రీమ్ వారియ‌ర్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై య‌స్‌.ఆర్‌. ప్రకాష్ బాబు, య‌స్‌.ఆర్‌. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు. రష్మిక హీరో కార్తీ గురించి మాట్లాడుతూ, సుల్తాన్ టీం నన్ను చెన్నైలో చాలా బాగా చూసుకున్నారు. మన హైదరాబాద్ గురించి అక్కడ ఎక్కువ బిల్డప్ ఇచ్చేసాను. కాబ్బటి కార్తీని బాగా చూసుకోండి అంటూ రష్మిక కోరారు. మధ్యలో ఫాన్స్ సూర్య, సూర్య అంటూ గోల చేశారు. వారితో పాటుగా రష్మిక కూడా కలిసి నినాదాలు చేశారు. అయితే ఫ్యాన్స్ ఎంత సేపటికీ ఆగకపోవడంతో, నన్ను మాట్లాడనివ్వండిరా అంటూ క్యూట్ గా రిక్వెస్ట్ చేసింది రష్మిక. మరి ఆ వీడియో ఒక్కసారి మీరు చూసేయండి.

Share post:

Latest