జబర్దస్త్‌కు యాంక‌ర్‌ ర‌ష్మి గుడ్ బై.. కార‌ణం అదేన‌ట‌?

ప్ర‌ముఖ కామెడీ షో జ‌బ‌ర్ద‌స్త్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ షో.. గ‌త ఏడేళ్ల నుంచి స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ అవుతూనే ఉంది. ఇప్ప‌టికే ఈ షో ద్వారా వంద‌ల మంది న‌టులు ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు. ఇక‌ మొద‌ట్లో ఒక రోజే వ‌చ్చే ఈ షో.. క్ర‌మంగా జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ గా విభ‌జించి రెండు రోజులు ప్ర‌సారం చేస్తున్నారు.

- Advertisement -

జబర్దస్త్‌కు అన‌సూయ యాంక‌ర్ కాగా.. ఎక్స్ ట్రా జబర్దస్త్ కు ర‌ష్మి యాంక‌ర్‌గా వ్యవ‌హ‌రిస్తోంది. వీరిద్ద‌రూ త‌మ అందచందాల‌తో షోకు మ‌రింత హైప్ క్రియేట్ చేస్తుంది. ఈ కామెడీ షో హిట్ అవ్వ‌డానికి వీరిద్ద‌రూ కూడా ఒక కార‌ణం అన‌డంలో సందేహం లేదు. అయితే యాంక‌ర్ ర‌ష్మి ఈ షోకు గుడ్ బై చెప్పే ఆలోచ‌న‌లో ఉన్నారంటూ ప్ర‌స్తుతం జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇతర చానల్స్ లో ఎన్ని ఆఫర్లు వచ్చినా జబర్దస్త్‌ను వీడ‌లేదు ర‌ష్మి. కానీ, ఇప్పుడు త‌న మ‌న‌సును మార్చుకుని జబర్దస్త్ వీడేందుకు ర‌ష్మి రెడీ అవుతుంద‌ట‌. జబర్దస్త్ కు వచ్చిన ఐదేళ్ళలో ఎన్ని సార్లు అడుగుతున్నా కేవలం మూడు సార్లు మాత్రమే రెమ్యున‌రేష‌న్ పెంచారని.. ఆ కార‌ణంగానే ర‌ష్మి ఈ షోకు గుడ్ బై చెప్పే ఆలోచ‌న‌లో ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాల్సి ఉంది.

Share post:

Popular