రాంగోపాల్ వర్మ నుంచి మరో దెయ్యం సినిమా..!?

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో డిఫరెంట్ చిత్రంతో రాబోతున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ తో పాటు హారర్ చిత్రాలతో కూడా ప్రేక్షకుల్ని భయపెట్టే ఆర్జీవి చాలా కాలం తరువాత ఒక దెయ్యం కథతో రానున్నారు. Rgv దెయ్యం అనే మరో కొత్త దెయ్యం కథతో రాబోతున్నారు. ఈ మూవీలో సిమియర్ నటుడు రాజశేఖర్ హీరోగా నటించగా, స్వాతి దీక్షిత్ ,తనికెళ్ల భరణి, అనితా చౌదరి, జీవ, బెనర్జీ వంటి నటులు ప్రముఖ పాత్రల్లో నటించారు.

ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 16 న తెలుగు, తమిళం, మలయాళం,కన్నడ,హిందీ తో కలిసి 5 భాషలలో రిలీజ్ కి సిద్ధమవుతున్నట్లు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఈ సినిమా అన్ని వర్గాల వారికీ బాగా నచ్చడంతో పాటు సినిమాను చూసిన ప్రేక్షకులందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారని రామ్ గోపాల్ వర్మ అన్నారు.

Share post:

Latest