ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `శివ` సినిమాతో డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన వర్మ.. మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈయన ఎప్పుడూ ముక్కుసూటి తనంతో ఉన్నది ఉన్నట్టు చెబుతూ ఏదో వివాదంలో చిక్కుకుంటుంటారు.
ఇక ఎవరు ఏమనుకున్నా.. ఏమన్నా భయం, బెరుకు ఏమాత్రం లేకుండా తనకు తోచిన పనిని తనదైన స్టైల్‌లో చేసుకుంటూ పోతాడు వర్మ. అయితే నేడు వర్మ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సినీ తారలు, నెటిజన్లు, అభిమానులు ఆయనకు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. అందరిలా బర్త్‌డే విషెస్ తెలిపిన వారికి ధన్యవాదాలు చెప్పడం వర్మ స్టైల్ కాదు.
అందుకే తన స్టైల్‌లోనే స్పందిస్తూ.. ఓ షాకింగ్ పోస్ట్ పెట్టాడు. `నేడు నా పుట్టిన రోజు కాదు. ఇది నిజానికి నా డెత్ డే. ఎందుకో తెలుసా? నా ఆయుష్షులో మరో సంవత్సరం తగ్గిపోయింది` అంటూ ఈ ఉదయం ఆయన ట్వీట్ చేశారు. దీనికి ఏడుపు మొహం ఎమోజీని సైతం తగిలించారు. ఇక వర్మ ట్వీట్ చూసి విస్తుపోవడం నెటిజన్ల వంతు అయింది.
No , it’s not my birthday but it’s my deathday today because one more year in my life died today 😢😢😢
— Ram Gopal Varma (@RGVzoomin) April 7, 2021