సోనూసూద్‌తో చ‌ర‌ణ్ ఫైట్‌.. ఎందుకంటే..?

April 16, 2021 at 12:41 pm

రియ‌ల్ హీరో సోనూసూద్‌తో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఫైట్ చేయ‌నున్నాడ‌ట‌. కానీ ఇది రియ‌ల్ లైఫ్‌లో కాదు. రీల్ కోసం అంట. రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు దర్శకుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఆచార్య మోవీటిజో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇందులో సిద్ధ అనే న‌క్స‌లైట్ పాత్ర‌లో చరణ్ క‌నిపించ‌నున్నాడు. ప్ర‌స్తుతం కోకాపేట‌లో వేసిన ధ‌ర్మ‌స్థ‌లి ఆలయం సెట్‌లో మూవీ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది.

తాజా షెడ్యూల్‌లో రామ్ చ‌ర‌ణ్‌, సోనూసూద్ మధ్య పెద్ద భీకరమయిన ఫైట్‌ను ప్లాన్ చేశాడ‌ట కొర‌టాల శివ‌. యాక్ష‌న్ ప్యాక్డ్ విజువ‌ల్స్ తో కొర‌టాల ఈ ఫైట్‌ను ప్లాన్ చేసాడ‌ని సమాచారం. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే ఈ చిత్రంలో క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. భారీ బ‌డ్జెట్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను రామ్ చ‌ర‌ణ్‌, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి మ‌ణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మే 13న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

సోనూసూద్‌తో చ‌ర‌ణ్ ఫైట్‌.. ఎందుకంటే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts