చీర‌క‌ట్టులో ట్రెండింగ్ అవుతున్న రాజోలు భామ..!

షాపింగ్‌మాల్‌, జ‌ర్నీ సినిమాలతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు పరిచయం అయింది మన తెలుగు అమ్మాయి రాజోలు భామ నటి అంజ‌లి. తూర్పు గోదావ‌రి జిల్లా రాజోలుకు చెందిన అంజ‌లి తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌ను అలరిస్తూ స‌క్సెస్‌ఫుల్‌గా తన సినిమా కెరీర్‌ను కొనసాగిస్తుంది. ప్రముఖ స్టార్ హీరోల‌తో క‌లిసి న‌టిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. నటి అంజ‌లి ప్రస్తుతం వ‌కీల్‌సాబ్ సినిమాలో న‌టిస్తోంది.

వ‌కీల్‌సాబ్ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. తాజాగా సంప్ర‌దాయ చీర‌క‌ట్టులో మెరిసిపోతున్న పిక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. యెల్లో క‌ల‌ర్ శారీ, గ్రే బ్లౌస్ లో ఉన్న అంజ‌లి అందాల జాబిల్లిలా మెరిసిపోతుంది. వ‌కీల్‌సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజ‌రైన అంజ‌లి చీర‌క‌ట్టులో కెమెరాకు చిక్కింది. తెలుగు సంప్రదాయం ఉట్టిప‌డేలా చీరలో కవిస్తున్న అంజలి ఫొటోలు చూస్తే కుర్రకారు కి నిద్ర పట్టదు.