స్పెష‌ల్ ఫ్లైట్‌లో హైదరాబాద్‌కి చేరిన‌ రజనీ..కారణం అదే!

సౌత్ స్టార్ ర‌జ‌నీ కాంత్ స్పెష‌ల్ ఫ్లైట్‌లో తాజాగా హైద‌రాబాద్‌కు చేరుకున్నారు. ఈయ‌న ఇప్ప‌టికిప్పుడు హైద‌రాబాద్ రావ‌డానికి కార‌ణం `అన్నాత్తే`. ఈ సినిమా పూర్తి చేసిన వెంట‌నే త‌మిళ‌నాడులో కొత్త పార్టీ స్థాపించి రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని ప్ర‌క‌టించారు. కానీ, ఈ సినిమా షూటింగ్ టైమ్‌లో ర‌జ‌నీ తీవ్ర అనారోగ్యానికి గుర‌కావ‌డం.. దాంతో రాజ‌కీయాల్లోకి రాలేన‌ని ప్ర‌క‌టించ‌డం చ‌క‌చ‌కా జ‌రిగాయి.

ఇక ఇటీవ‌ల త‌మిళ‌నాడు ఎన్నిక‌లు కూడా పూర్తి అయ్యాయి. అయితే ఇప్పుడు వ‌ర‌కు విశ్రాంతి తీసుకున్న ర‌జ‌నీ.. మ‌ళ్లీ అన్నాత్తే షూటింగ్‌లో బిజీ కావ‌డానికి తాజాగా చెన్నై విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రజనీకాంత్ హైద‌రాబాద్‌కు చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్, నయనతార, మీనా, ఖుష్బూ వంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రం 75 శాతం వరకూ పూర్తి కాగా, మిగిలిన షూటింగ్ ను పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధం అయింది.

Share post:

Latest