పెళ్లి పీట‌లెక్క‌బోతున్న చిరు హీరోయిన్‌‌‌‌..త్వ‌ర‌లోనే ఎంగేజ్‌మెంట్!

ల‌క్ష్మి రాయ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కాంచనమాల కేబుల్ టి.వి సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ..ఆ త‌ర్వాత ప‌లు చిత్రాల్లో న‌టించిన‌ప్ప‌టికీ పెద్ద‌గా స‌క్సెస్ కాలేక‌పోయింది. కానీ, ఐటెం సాంగ్స్ ద్వారా మాత్రం ఈ బ్యూటీకి సూప‌ర్ క్రేజ్ ద‌క్కింది.

ఈ అమ్మ‌డు చిరంజీవి హీరోగా తెర‌కెక్కిన‌ `ఖైదీ నెంబర్ 150`, ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా తెర‌కెక్కిన `సర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌`, ర‌వితేజ హీరోగా తెర‌కెక్కిన `బ‌లుపు` ఇలా ప‌లు చిత్రాల్లో ఐటెమ్ సాంగ్స్ చేసింది. ఇదిలా ఉంటే.. త్వ‌ర‌లోనే ల‌క్ష్మి రాయ్ పెళ్లి పీట‌లెక్క‌బోతోంది. అంతేకాదు, తాజాగా ఎంగేజ్‌మెంట్ డేట్‌ను కూడా సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించింది.

`చాలా కాలంగా పెళ్లి ఎప్పుడన్న విషయమై తనను ఎందరో ప్రశ్నిస్తున్నారని, తానేమీ దాచుకోవాలని భావించడం లేదని, నేను ఇప్పటికే రిలేషన్ షిప్ లో ఉన్నానని, 27న నిశ్చితార్థం జరుగనుందని తెలిపింది. ఇది ఎప్పుడో ప్లాన్‌ చేసుకున్నది కాదు. అనుకోకుండా జరిగింది. నా కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉన్నారు. నా లవ్‌తో జీవితాన్ని పంచుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను` ల‌క్ష్మి సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించింది.

Share post:

Latest