ప్రభాస్ మొహమాటస్తుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. బాగా తెలిసిన వాళ్లతో మినహా.. బయట వాళ్లతో ప్రభాస్ అస్సలు కలవలేడు. ఇక ఆ మొహమాటంతోనే ప్రభాస్ ఒక ముద్దు సీన్ చేసేందుకు తండ్రిని పర్మిషన్ అడిగాడట. వినడానికి విచిత్రంగా ఉన్న ఇదే నిజం.
ఈ విషయాన్ని స్వయంగా ఆయన మేనేజర్, స్నేహితుడు, ప్రముఖ కమెడియన్ ప్రభాస్ శ్రీను తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. 2003లో బి.గోపాల్ తెరకెక్కించిన అడవి రాముడు సినిమాలో నటించాడు ప్రభాస్. ఈ చిత్రంలో దివంగత నటి ఆర్తి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. అయితే ఈ చిత్రంలో ఓ ముద్దు సీన్లో నటించాలని ప్రభాస్‌కు బీ.గోపాల్ చెప్పారట.
దాంతో కంగారు పడిపోయిన ప్రభాస్.. వెంటనే లొకేషన్ నుంచి ఇంటికి ఫోన్ చేసి నాన్నగారు ముద్దు సీన్ అంటున్నారు.. నటించమంటారా అంటూ తండ్రి సూర్యనారాయణ రాజు దగ్గర పర్మిషన్ తీసుకున్నాడట. ఆయన ఓకే చెప్పాకే.. ప్రభాస్ ఆ సీన్ చేశాడని ప్రభాస్ శ్రీను తెలిపాడు. ఇక అప్పుడే కాదు ఇప్పటికీ రొమాంటిక్ సీన్స్ చేయడానికి ఆయన చాలా మొహమాటపడుతుంటాడని ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చాడు.