అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న పవర్ ప్లే..!

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, హేమల్ ఇంగ్లే జంటగా నటించిన థ్రిల్లర్ మూవీ పవర్ ప్లే. దర్శకుడు కొండా విజయ్ కుమార్ ఈ సినిమాని తెరకెక్కించారు. మార్చి 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకు మంచి థ్రిల్ అందించి అలరించింది. ఇప్పుడు తాజాగా పవర్ ప్లే సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమాని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ద్వారా అన్ని వర్గాల ప్రేక్షకులు చూసి థ్రిల్ పొందుచు.

ఇప్పటి దాకా లవర్ బాయ్ ఇమేజ్ తో సినిమా లవర్స్ కు దగ్గరైన రాజ్ తరుణ్ పవర్ ప్లేతో తన సత్తా చూపించాడు. ఈ థ్రిల్లర్ లో సీరియస్ లుక్ తో సరికొత్తగా కన్పించారు రాజ్ తరుణ్. ఈ చిత్రంలో పూర్ణ‌, మ‌ధు నంద‌న్‌, అజ‌య్‌, కోటా శ్రీ‌నివాస‌రావు, రాజా ర‌వీంద్ర‌, ధ‌న్‌రాజ్‌ త‌దిత‌రులు కీలక పాత్రల్లో నటించారు. మ‌హిధర్‌, దేవేశ్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.

Share post:

Latest