ప‌వన్‌-హరీష్ శంకర్ సినిమా‌ టైటిల్ అదేన‌ట‌?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రస్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈయ‌న గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన ద‌ర్శ‌కుల్లో మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఒక‌రు. ప‌వ‌న్‌, హ‌రీష్ కాంబోలో వ‌చ్చిన `గబ్బ‌ర్ సింగ్` చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో.. వీరి తాజా చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బ‌డ్జెట్‌తో నిర్మించ‌బోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి కాగా.. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జ‌రుపుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప‌వ‌న్ తండ్రీ కొడుకులుగా డ‌బుల్ రోల్ పోషించ‌నున్నాడ‌ట‌. అందులో తండ్రి క్యారెక్టర్‌ను ఐబీ ఆఫీసర్ గా, కొడుకు క్యారెక్ట‌ర్‌ను కాలేజ్‌ లెక్చరర్‌గా చూపించనున్నాడట.

ఇదిలా ఉంటే.. ఇంకా సెట్స్ మీద‌కే వెళ్ల‌ని ఈ సినిమాను టైటిల్‌ను కూడా ఖరారు చేసిన‌ట్టు తెలుస్తోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రానికి `సంచారి` అనే టైటిల్‌ను ఫిక్స్ చేశార‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే టైటిల్‌ను అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నాడ‌ని తెలుస్తోంది.

Share post:

Latest