ర‌వితేజ ఆఫ‌ర్‌కు నో చెప్పిన ‘జాతిరత్నాలు’ భామ‌.. కారణం అదేన‌ట‌!

ఫరియా అబ్దుల్లా.. ఇప్పుడు ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నవీన్ పొలిశెట్టి హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా కేవీ అనుదీప్ తెర‌కెక్కించిన చిత్రం `జాతిర‌త్నాలు`. తక్కువ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్స్ కొల్ల‌గొట్టింది.

ఈ చిత్రం ద్వారా అటు న‌వీన్‌తో పాటు ఫ‌రియాకు సూప‌ర్ క్రేజ్ ద‌క్కింది. దీంతో ప్ర‌స్తుతం ఈ బ్యూటీకి వ‌రుస ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవ‌లె మాస్ మహారాజ రవితేజ్ సినిమాలో కూడా ఫ‌రియాకు హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చిందనే వార్తలు వైర‌ల్ అయ్యాయి. అలాగే మ‌రో రెండు నిర్మాణ సంస్థలు కూడా ఫరియాకు ఆఫ‌ర్లు ఇచ్చిన‌ట్టు టాక్ న‌డుస్తోంది.

అయితే తాజాగా స‌మాచారం ప్ర‌కారం.. ర‌వితేజ సినిమాతో స‌హా అన్ని ఆఫ‌ర్ల‌కు ఫ‌రియా ఫ‌రియా నో చెప్పిందట. ఇందుకు కార‌ణం ఆమె హైటే అని తెలుస్తోంది. వాస్త‌వానికి తెలుగు హీరోయిన్లలో ఫరియానే హైట్‌గా ఉంటుంది. దీంతో తనకంటే పొడగు తక్కువగా ఉన్న హీరోల పక్కన నటించేందుకు ఫరియా ఇష్ట‌ప‌డ‌టం లేద‌ట‌. అందుకే వ‌చ్చిన ఆఫ‌ర్ల‌ను వ‌దులుకుంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Share post:

Latest