క‌రోనా ఎఫెక్ట్‌.. `ఆదిపురుష్‌` డైరెక్ట‌ర్ కీల‌క నిర్ణ‌యం!?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `ఆదిపురుష్‌` ఒక‌టి. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. రామాయణ ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా.. సీత‌గా కృతి స‌న‌న్‌, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, ల‌క్ష్మ‌ణుడిగా సన్నీ సింగ్‌ న‌టిస్తున్నారు. ఇటీవ‌ల ఈ సినిమా షూటింగ్ ముంబైలో ప్రారంభం అయింది.

ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోంది. అయితే మ‌రోవైపు క‌రోనా కేసులు మ‌ళ్లీ భారీగా పెరిగిపోతుండ‌డంతో.. తాజాగా ఓం రౌత్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. షూటింగ్‌ స్పాట్‌లో పాతికమందికంటే ఎక్కువ సిబ్బంది ఉండకూడదని ఆయ‌న నిర్ణ‌యించార‌ట‌. అలాగే షూటింగ్‌కి ప్యాకప్‌ చెప్పగానే సెట్‌ మొత్తాన్ని శానిటైజ్‌ చేయిస్తున్నార‌ట‌.

ఏదేమైనా ఈ భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని కేవ‌లం 25 మంది సిబ్బంది సాయంతో తెర‌కెక్కించ‌డం చాలా క‌ష్ట‌మ‌నే చెప్పాలి. అయిన‌ప్ప‌టికీ క‌రోనా కార‌ణంగా ద‌ర్శ‌కుడు ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. కాగా, తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Share post:

Latest