నిధి అగర్వాల్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కనున్న `హర హర వీర మల్లు` చిత్రంలో నిధి ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఈ బ్యూటీని మరో బంపర్ ఛాన్స్ వరించినట్టు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో నిధి జతకట్టబోతోందట. ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కార్ వారి పాట` చేస్తున్న మహేష్.. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.
అయితే ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా ఎంపిక చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారట. ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే మహేష్ సినిమాలో నిధి ఛాన్స్ దక్కించుకుందా..లేదా.. అన్నది త్వరలోనే తెలియనుంది.