`ఆర్ఆర్ఆర్‌` నుంచి మ‌రో అదిరిపోయే అప్డేట్..‌?

rrr

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)‌`. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో డీవీవీ దానయ్య భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్, ఎన్టీఆర్ సరసన బ్రిటన్ మోడల్ ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా యువ బాలీవుడ్ సంగీతదర్శకుడు, గాయకుడు, పాటల రచయిత విశాల్ మిశ్రా ట్విట్ట‌ర్ వేదిక‌గా.. రాజ‌మౌళి, సంగీత స్వరకర్త కీరవాణితో దిగిన ఓ ఫొటోను షేర్ చేశారు.

అంతేకాదు, `మేం ఈ రోజు స్టూడియోలో మ్యాజిక్ చేసాం. ఆర్ఆర్ఆర్‌ త్వరలో వస్తుంది` అని కామెంట్ కూడా పెట్టాడు. దీంతో ఆర్ఆర్ఆర్‌ కి పాటల పని అలాగే రీరికార్డింగ్ పనులు సాగుతున్నాయని స్ప‌ష్ట‌మైంది. ఇక మ‌రోవైపు ఈ సినిమా విడుద‌ల వాయిదా అంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే విశాల్ మిశ్రా పోస్ట్‌తో.. అనౌన్స్ చేసిన‌ తేదీకే ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు జ‌క్క‌న్న తీవ్రంగా కృషి చేస్తున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది.

https://twitter.com/VishalMMishra/status/1380914732710903813?s=20