ఈ ఎయిర్ మాస్క్ ద్వారా కేవలం 15 నిమిషాల్లో కరోనా ఖతం..!?

కరోనా విజృంభిస్తున్న క్రమంలో కేరళకు చెందిన ఆల్ ఎబౌట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వోల్ఫ్ ఎయిర్ మాస్క్ పేరుతో ఒక ఎలక్ట్రానిక్ పరికరాన్ని తయారుచేసింది. ఈ వస్తువు చూడ్డానికి గోడకు తగిలించే సీసీ కెమెరాలాగా కనిపిస్తుంది కానీ దీని పనితీరు పూర్తిగా డిఫరెంట్ ఉంటుంది. ఇది గాలిలో కరోనాను చంపుతుందని కంపెనీ చెప్తుంది. ఇందులో అయాన్ టెక్నాలజీని ఉస్ చేశారు. ఇలాంటి టెక్నాలజీ వాడటం మన దేశంలోనే ఇదే మొదటిసారి అంటున్నారు.

- Advertisement -

తిరువనంతపురంలోని రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ RGCB ఈ వస్తువును టెస్ట్ చేసినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు శ్యామ్ కృష్ణన్ తెలిపారు. ఈ RGCBని భారత వైద్య పరిశోధనా మండలి ఇకంర్ దీని గుర్తించింది. ఈ వస్తువు తనకు తానుగా స్టెరిలైజ్ చేసుకుంటుంది. దాని చుట్టూ 1000 చదరవు అడుగుల గాలిలో ఉన్న వైరస్‌ను 15 నిమిషాల్లో చంపుతుంది. 99 శాతం వైరస్ దీని ద్వారా పోతుంది. ఈ వస్తువు కంటిన్యూగా 60వేల గంటలు పనిచేస్తుంది. ఇలా 9 ఏళ్ల పాటూ ఈ పరికరం పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ వస్తువుని ఆన్‌లైన్ ఈ కామర్స్ సైట్లలో అమ్ముతున్నారు. ఇండియామార్ట్ www.indiamart.com లో ఈ వస్తువు ధరను రూ.29,500 అముతున్నారు.

Share post:

Popular