అదిరిపోయిన‌ `మేజర్‌` టీజ‌ర్..మీరు చూశారా?‌

April 12, 2021 at 5:13 pm

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ తాజా చిత్రం `మేజ‌ర్‌`. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ్ల, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ కీలక పాత్ర‌లు పోసిస్తున్నారు. 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన దివంగత ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

మహేష్ బాబు జిఎమ్‌బి ఎంటర్టైన్మెంట్ మరియు ఏప్ల‌స్ఎస్‌ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తుంది. తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ‘సైనికుడిగా ఉండడం అంటే ఏమిటి?’ అనే వాయిస్ ఓవర్‌తో ప్రారంభం అయిన ఈ టీజ‌ర్ ఆధ్యంతం ఆక‌ట్టుకుంది.

మేజర్ సందీప్ ఎలా ఈ లోకాన్ని విడిచారు అనేది మాత్రమే కాకుండా.. ఎలా జీవించాడు అనేది ఇందులో చూపించ‌బోతున్నారని టీజ‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది. అలాగే `బోర్డర్ లో ఆర్మీ ఎలా ఫైట్ చేయాలి.. ఇండియా క్రికెట్ మ్యాచ్ ఎలా గెలవాలి అని అందరూ ఆలోచిస్తారు.. అదీ దేశ భక్తే.. దేశాన్ని ప్రేమించడం అందరి పనే.. వాళ్ళని కాపాడటం సోల్జర్ పని` అని శేష్ చెప్పే డైలాగ్ ఆక‌ట్టుకుంటోంది. మొత్తానికి ఈ టీజ‌ర్ అదిరిపోవ‌డంతో పాటు సినిమాపై అంచ‌నాల‌ను కూడా పెంచేసింది.

అదిరిపోయిన‌ `మేజర్‌` టీజ‌ర్..మీరు చూశారా?‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts